Thursday, September 21, 2023

Breaking | తుఫాన్ ను ఢీకొన్న లారీ.. ఐదుగురు మృతి

రాయచోటి , ప్రభ న్యూస్ : అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి . కేవి పల్లి మండలం మఠంపల్లి క్రాస్ వద్ద తుఫాన్ వాహనంను లారీ ఢీకొంది. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఐదుగురు మృతి చెందగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.

మృతులు కర్ణాటక బెల్గాం జిల్లా అతని తాలూకా బండి చేరి గ్రామాను వాసులుగా గుర్తించారు. వీరు శ్రీశైల దర్శన అనంతరం తిరుమల దర్శనానికి వెళ్లి తిరుమల దర్శనం జరగకపోవడంతో తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -
   

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి కలకడ పోలీసులు చేరుకుని క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .తీవ్రగాయలైన వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement