Thursday, June 8, 2023

ఎపి వాణిజ్య శాఖ‌లో ర‌చ్చ ర‌చ్చ‌…

ఉద్యోగుల మధ్య భగ్గుమన్న విభేదాలు!
అధికారులు వర్సెస్‌ ఉద్యోగులు
ఆందోళనకారులపై చర్యలకు నిర్ణయం
పలువురు ఉద్యోగులకు చార్జి మెవెూలు
ఆందోళన వద్దని ఉద్యోగ సంఘ నేతల హితవు

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఆందోళన చేసిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలకు దిగడం చర్చనీయాం శంగా మారింది. గతేడాది సాధారణ బదిలీల నుంచి ఉప్పు, నిప్పులా ఉన్న ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతల మధ్య నెలకొన్న విబేధాలు తాజాగా షోకాజ్‌ నోటీసుల జారీతో భగ్గుమంటున్నాయి. సర్వీసు నిబంధనలకు విరు ద్ధంగా ఆందోళనకు దిగిన ఉద్యోగులపై చర్యలకు అధికారులు ఉపక్రమిస్తుంటే.. ఉద్యోగ సంఘం నేతలు మాత్రం ఆందోళన చెందొద్దంటూ భరోసా ఇస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నా రు. సాధారణ బదిలీల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపిస్తూ, ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ విచారణకు పట్టుబట్టింది. ఉద్యోగ సంఘ నేత కేఆర్‌ సూర్యనారాయణ డిమాండ్‌ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌ఈ కృష్ణమోహన రెడ్డితో విచారణకు ప్రభుత్వం ఆదేశిం చింది. విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ నివేదిక తమకు అందజే యాలంటూ గత నెల 27న కేఆర్‌ సూర్యనారాయణ నేతృత్వంలో అదనపు కమిష నర్‌ ఛాంబర్‌, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కారిడార్‌లో ఐదు గంటల పాటు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఉద్యోగుల ఆందోళనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌, వాణిజ్య పన్నుల శాఖ ఇన్‌చార్జి ముఖ్య కమిషనర్‌ హోదాలో గత నెల 30న షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, సంఘం గుర్తింపు షరతుల ఉల్లంఘన తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షునికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయరాదో తెల పాలి అంటూ పేర్కొనడంతో పాటు భవిష్యత్‌లో ఈ తర హా ఘటనలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తప్ప వని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామ ంటూ ఆ నోటీసులో స్పష్టం చేశారు. అప్పటి నుంచి కొనసాగుతున్న విబేధాలు ఉద్యోగులకు షోకా జ్‌ నోటీసుల జారీతో ముదిరి పాకానపడ్డాయి.

- Advertisement -
   

ఉద్యోగుల్లో అలజడి..
విజయవాడలోని మూడు డివిజన్లతో పాటు గుంటూరులోని రెండు డివిజన్లు, నెల్లూరు ఉద్యోగులు డిసెంబర్‌ 27న జరిగిన ఆందోళనలో పాల్గొన్నట్లు ఉన్నతాధికా రులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆం దోళనకు సంబంధించిన వీడియోలను ఆయా డివిజన్ల సంయుక్త కమిషనర్లకు పంపి ఉద్యోగుల గుర్తింపు కార్యక్ర మాన్ని చేపట్టారు. ఆందోళన జరి గిన రోజు ఉద్యోగులు విధులకు హాజరైనట్లు అటెండెంన్స్‌, బయో మెట్రిక్‌ విధానంలో సం తకాలు పెట్టారా? కార్యాలయం వదిలి బయటకు వెళ్లేం దుకు తగిన అనుమతి తీసుకున్నారా? తదితర అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదే శించారు. ఒకవేళ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తిస్తే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో జేసీలు చర్యలకు ఉపక్రమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనకు దిగిన ఉద్యోగులపై ఉన్నతాధికారుల చర్యల నేపధ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో కలకలం రేగుతోంది.
ఆందోళన వద్దు..
ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దంటూ ఏపీ సీటీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్‌ సూర్యనారాయణ, జీఎం రమేష్ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు వారొక ప్రకటన చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఆందోళన కాబట్టి రాష్ట్ర సంఘమే పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు. సం క్రాంతి తదుపరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ నిర్ణయించనున్నట్లు పేర్కొంటూ మెమో తీసుకున్న పదో రోజు ఎకనాలెడ్జి తీసుకొని రిఫరె న్స్‌లు అందిన తర్వాత వివరణ ఇస్తామంటూ పేర్కొనా లని వారు సూచించారు. ఇందుకు అవసరమైన సహకా రం రాష్ట్ర యూనియన్‌ నుంచి వస్తుందని వారు పేర్కొ న్నారు. ఆందోళనలో పాల్గొన్న విజయవాడ, గుంటూ రు, నెల్లూరు డివిజన్ల కార్యవర్గ సభ్యులకు వారు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement