Wednesday, April 24, 2024

రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష.. కేంద్రాన్ని టైం కోరిన ఏపీ సీఎస్

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగించేందుకు మూడు నెలలు గడువు కావలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే, బొగ్గు, ఇంధనం, స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఢిల్లీ నుండి ప్రగతి ప్రాజెక్టుల కేంద్ర మంత్రి మనీష్ మాండవీయ వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయనగరం-టిట్లాఘర్, నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మిగతా భూమి సేకరించి అప్పగించేందుకు మరో మూడు మాసాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర కేంద్ర మంత్రులు.. ఆ గడువులోగా భూమి అప్పగించాలని చెప్పారు. ప్రగతి ప్రాజెక్టులను ప్రధాన మంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిషయంలో అత్యంత శ్రద్ధ కనపర్చి ఆయా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా తోడ్పడాలని కేంద్ర మంత్రులు సూచించారు. వివిధ రాష్ట్రాల వారీ ప్రగతి ప్రాజెక్టులు పెండింగ్ అంశాలను వారు సిఎస్ లతో సమీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement