Wednesday, March 22, 2023

ఢిల్లీలో జగన్.. ప్రధానిని కలవనున్న ఏపీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. నిన్న ఢిల్లీ చేరుకున్న జగన్ జన్‌పథ్ ఒకటిలో రాత్రి బస చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన చర్చించనున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారని తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించే అవకాశముందని సమాచారం.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement