Wednesday, June 16, 2021

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ

పేదలందరికీ ఇళ్ళు – పీఎంఏవైలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధానికి సీఎం లేఖ రాశారు. ఇప్పటికే ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఏపీ సర్కార్ రూ.23535 కోట్లు వేచ్చించిందని పేర్కొన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు మొత్తం రూ.34109 కోట్లు అవుతుందని తెలిపారు. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలని సంబంధిత శాఖలను ఆదేశించాలని జగన్ లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News