Tuesday, September 26, 2023

AP CM: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒడిశాలో రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంకైర్వీ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం కావాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని అధికారులను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement