Thursday, March 28, 2024

కూ యాప్ ద్వారా న‌ర్సుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఏపీ సీఎం జ‌గ‌న్

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూ యాప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా సేవ‌లు అందించే సేవామూర్తులు న‌ర్సులు అని, ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న‌ట్లుగా ఎంతోమందికి జీవం పోసే ప్రాణ‌దాత‌లు వార’ని సీఎం జగన్‌ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. న‌ర్సులంద‌రికీ సీఎం జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement