Tuesday, December 3, 2024

AP | రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులతో పాటు.. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సమేతంగా రాష్ట్రానికి వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది.

కాగా, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం నిన్న విజయవాడ వచ్చారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారిక బంగ్లాలో కోవింద్ బస చేయనున్నారు. రేపు (శనివారం) కేఎల్ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో కోవింద్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement