Thursday, September 12, 2024

AP CM – నేడు విజ‌య‌వాడ‌లో చేనేత దినోత్స‌వ వేడుక‌లు …

హాజ‌రుకానున్న చంద్ర‌బాబు
చేనేత కార్మికులకు వ‌రాల జ‌ల్లు
ప్ర‌త్యేక ప్యాకేజ్ ప్ర‌క‌టించ‌నున్న సిఎం
ఖాదీ బోర్డులో ఉద్యోగ భ‌ర్తీకి అవ‌కాశం
వీవ‌ర్స్ రుణాల మాఫీ చేయ‌నున్న చంద్ర‌బాబు

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – చేనేత దినోత్సవం సంద‌ర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ మేరిస్ స్టెల్లా లో నిర్వహించే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.. వాస్త‌వానికి ఇవాళ బాపట్ల లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే అక్క‌డ భారీ వ‌ర్షం కార‌ణంగావేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు.. ఇక ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు రా చంద్రబాబు . నేతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు కూడా సిద్ధమయ్యారు . చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా 25 వేల ఉద్యోగాలకు ఆమోదం కూడా తెలుపనున్నారు . 26 సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ కూడా అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. 8వ తరగతి అర్హతతో ఐదు లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాల పథకాన్ని కూడా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, చీరాల‌, మంగ‌ళ‌గిరి ల‌లోని చేనేత కార్మికుల‌తో చంద్ర‌బాబు వీడియో కాన్ఫ్ రెన్స్ ద్వారా ఈ వేదిక‌పై నుంచి మాట్లాడ‌నున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement