Friday, October 11, 2024

AP – జగన్ పాల‌న‌లో రాయలసీమలో విధ్వంసం – చంద్ర‌బాబు

ఆ 21 మంది ఎంపీలే రాష్ట్రానికి సంజీవని.
దీపావళికి మూడు సిలిండర్లు
మహిళలకు చంద్రబాబు కానుక.
పుచ్చకాయల మాడ గ్రామంను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
త్వరలో మద్యం పాలసీ అమలు
ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.
గుండ్రేవుల, వేదవతిని పూర్తిచేస్తాం.
ఓర్వకల్లును ఇండస్ట్రీస్ హబ్ గా తీర్చిదిద్దుతాం.
పత్తికొండలో టమోటో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం.
ప్రతి ఇంటిపైన సోలార్.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాo.
జగన్ హయంలో రాయలసీమలో విధ్వంసం
రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారు.
అయినా బెదిరేది లేదు గాడిలో పెడతా.
గత ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల అప్పు చేశారు.
వాటికి లక్ష కోట్లు వడ్డీలకే సరిపోతుంది
పుచ్చకాయ మడల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.

కర్నూల్ బ్యూరో – గత ఎన్నికల్లో ప్రజలు గెలిపించిన 21 మంది ఎంపీలే రాష్ట్రానికి సంజీవిని అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయకొండ గ్రామంలో మంగళవారం ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పించన్లను పంపిణీ చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ను రూ.4 వేలకు పెంచామని గుర్తు చేశారు. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రక్రియ ఇకపై కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావని.. జగన్‌ వెళ్తూ.. వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని.. ఇకపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు పెట్టుబడిదారులు పారిపోయారని.. తాము పెట్టుబడులు తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

- Advertisement -

గత ఐదేళ్లలో అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిందన్నారు. జగన్ వెళ్తూ.. వెళ్తూ రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారంటూ ఫైర్ అయ్యారు. 10 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ఇందుకు ప్రతినెల లక్ష కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. 22ఏ పేరుతో భూములు దోచుకున్నారు. మీరు గెలిపించిన 21 మంది ఎంపీలే నేడు మన రాష్ట్రానికి సంజీవనిలా మారారు. వాళ్లు లేకుంటేఎంత కష్టపడినా ఉపయోగం ఉండేది కాదన్నారు.


గత వైసీపీ ప్రభుత్వం 22ఏ పేరుతో భూములన్నీ దోచుకున్నారని, పాసు పుస్తకాల మీద కూడా వారి బొమ్మలు వేసుకున్నారని మండిపడ్డారు. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామని, ఆ భూములపై త్వరలోనే సర్వే చేస్తామన్నారు. జీఎఎస్‌తో మీ ప్రజల భూములు వారికి అప్పగిస్తామన్నారు.

గతంలో ఉన్న నాసిరకం మద్యాన్ని కాదని మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చామన్నారు. కొత్త మద్య విధానంతో శెట్టిబలిజ, ఈడిగ , గౌడలకు 10శాతం రిజర్వేషన్లుకల్పిస్తామన్నారు. రూ.100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతామని మహిళలకు హామీ ఇచ్చారు. భర్తలకు మద్యం మాన్పించే బాధ్యత భార్యలదేనన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీని దీపావళి రోజు
ప్రారంభించనున్నట్లు చెప్పారు.. కర్నూలులోహైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్నారు.త్వరలోనే కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తామని సీఎం రాయలసీమ ప్రజలకు హామీ ఇచ్చారు.


రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలనది నా లక్ష్యమని పేర్కొన్నారు. 2047నాటికి ఏపీని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసేవారు..సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది..ఇప్పుడు అలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రజలందరి సమక్షంలో మీటింగ్ జరుపుకునే స్వేఛ్చ వచ్చిందని చెప్పుకొచ్చారు.

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేది తన అభిమతమని అన్నారు చంద్రబాబు. గండ్రేవుల , గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అందులో భాగంగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 20లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పానని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

వాలంటీర్లు లేకుండా ఎలాంటి పని కాదని వైసీపీ నేతలు మాట్లాడారని.. కానీ వారు లేకుండానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నూలు పుచ్చకాయ మడ గ్రామంలో వర్క్ ఫ్రం హోంకు శ్రీకారం చుట్టాలనేదే తన ఆలోచన అన్నారు. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరిలోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మీటింగ్స్ అంటే పరదాలు కట్టేవారని.. చెట్లను నరికేసేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.సీఎం మీటింగ్ అంటేనే ప్రజలకు నరకం కనిపించేదని అన్నారు. . ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో ఓటు వేశారు. జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలను నెరవేరుస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. గత ప్రభుత్వంలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇప్పటికే రద్దు చేశామన్నారు. రీసర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు. వాటిని సరి చేస్తున్నాం. భూ సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాం. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేదే నా లక్ష్యం. అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement