Monday, October 7, 2024

AP పెన్షన్ లు స్వయంగా చంద్రబాబు పంపిణీ

పుచ్చకాయలమాడ గ్రామ లబ్ధిదారులతో సిఎం
కుటుంబ సభ్యులతో ఆత్మీయ పలకరింత
పెన్షన్ స్వయంగా ఇచ్చిన చంద్రబాబు కు కృతజ్ఞ‌త‌లు

కర్నూలు బ్యూరో – కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో లబ్ధిదారులు తలారి గంగమ్మ కు వితంతు పెన్షన్, చింతగింజల వెంకటేష్ కు వృద్ధాప్య పెన్షన్ లను వారి ఇంటి వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు అంద‌జేశారు.. ముందుగా తలారి గంగమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు.. వారి కుటుంబ స్థితి గతులను గురించి తెలుసుకున్నారు.. సిఎం స్వ‌యంగా వ‌చ్చిన త‌మ‌కు పెన్ష‌న్ లు ఇవ్వ‌డం ప‌ట్ల చంద్ర‌బాబుకు వారు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

- Advertisement -

అనంతరం పుచ్చకాయలమడ గ్రామంలో రూ.2.83 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు.ఈ సంద‌ర్భంగా గ్రామంలోని కాశీశ్వరస్వామి ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement