Saturday, March 25, 2023

ఫిబ్ర‌వ‌రి 8న ఏపీ కేబినెట్ స‌మావేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ సమావేశం కానుంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలపై ఆమోదం తెలుపనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డ్రోన్ సర్వే, లబ్ధిదారులకు అందాల్సిన పట్టాల పంపిణీ వంటి అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున.. ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement