Thursday, October 10, 2024

AP | ఈ నెల 10న కేబినెట్ భేటీ.. !

ఈ నెల 10వ తేదీన ఏపీ కూట‌మి ప్రభుత్వం మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలు తదితర అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అలాగే రాష్ట్రంలో చెత్తపై విధిస్తున్న‌ పన్ను రద్దుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దాంతో పాటు జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement