Saturday, December 7, 2024

AP – కూట‌మి తొలి బ‌డ్జెట్ రూ.2.90 లక్ష‌ల కోట్లు…కేబినెట్ ఆమోదం..

ఈరోజు అసెంబ్లీలో ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2.9లక్షల కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్ట‌నున్నారు.. ఈ బ‌డ్జెట్ ను నేడు చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఆమోద‌ముద్ర వేశారు..

అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు. రాజధాని రైతులను మంత్రి నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంటూ అభినందించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉంటుందని టిడిపి నేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement