Friday, March 29, 2024

పొత్తుల ప్ర‌స్తావ‌న వ‌ద్దే వ‌ద్దు..

అమరావతి,ఆంధ్రప్రభ: ‘పొత్తులు ఉండొచ్చు..ఉండక పోవచ్చు.. అవేవీ మీరు పట్టించుకోవద్దు.. మీరు సొంతంగానే ముందుకెళ్లండి’ అం టూ బీజేపీ జాతీయ నాయకత్వం ఏపీ నేతలకు క్లారిటీ ఇచ్చి నట్లు తెలిసింది. మిత్రపక్షం జనసేన తెదేపా వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో..రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టమైన దిశా నిర్థేశం చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో నిర్వహించ నున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అధిష్టానం నిర్ణయం పై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీ.మురళీ ధరన్‌ మరింత స్పష్టత ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని రాజ కీయ పరిణామాలు, బీజేపీ నిర్వహిస్తున్న పాత్ర తదితర అంశాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. సో మ, మంగళవారాల్లో నిర్వహించిన సమావేశాల్లో ప్రత్యే కంగా ఏపీపై జాతీయ నాయకత్వం దృష్టిసారించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదికి ముఖ ద్వారంగా ఉన్న ఏపీలో కాలూనేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న బీజేపీ..జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. గతం నుంచే జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ పెద్దగా కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. రాను రాను రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్య టన తర్వాత పరిస్థితి మారుతుందని అందరూ భావించారు. రెండు పార్టీల మధ్య దూరం తగ్గి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టొచ్చని భావిస్తున్న తరుణంలో..రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.

పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనను పోలీ సులు అడ్డుకోవడం దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో అధికార పార్టీ వ్యవహారశైలిపై తెదేపా అధినేత చంద్రబాబు మద్దతుగా నిలుస్తున్నారు. విశాఖ ఘటన తర్వాత సో ము వీర్రాజు సైతం పవన్‌కు మద్దతు తెలిపినప్పటికీ..అధికార పార్టీని గట్టిగా నిలువ రించాలనే కృతనిశ్చయంతో తెదేపా వైపే పవన్‌ మొగ్గు చూపుతున్నట్లు ఇప్పటం, రణస్థలం తదితర సమావేశాల్లో ఆయన చేస్తున్న ప్రకట నలను బట్టి స్పష్టమవుతోంది. బీజేపీ కూడా కలిసొస్తే బాగుం టుందనే అభిప్రాయం అటు జనసేన, ఇటు తేదేపా నేతల్లో ఉన్నప్పటికీ..జాతీయ నాయకత్వం మాత్రం ఆచీతూచి వ్యవహరిస్తోంది. పొత్తులను పక్కనబెట్టి సొంత ఎదు గుదలపై దృష్టిసారించాలంటూ అధిష్టానం నుంచి స్పష్టత వచ్చిన నేపధ్యంలో జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత రెండు కుటుంబ పార్టీలకు దూ రమంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించి ఉండొ చ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
కీలక సమావేశాలు
ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఏపీ బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. జాతీయ నాయకత్వం ఆలోచనను సైతం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి స్పష్టం చేయనున్నారు. అదే సమావేశాల్లో భవిష్యత్‌ కార్యాచరణ కూడా ప్రకటించనున్నారు. వచ్చే నెలలో అమిత్‌ షా రాష్ట్ర పర్యటన ఉంటుందనే సమాచారం నేపధ్యంలో ఈలోగా ఏపీ బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
పొత్తుల‌పై బేరీజు
పొత్తులపై జాతీయ నాయకత్వం బేరీజు లు వేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మెజారిటీ వర్గాలకు సంక్షేమ పథ కాలు అమలవుతున్నా యనేది కేంద్ర బీజేపీ నేతల భావన. ప్రధాన ఓటర్లు గా ఉన్న వారికి సంక్షేమ పథకాలు అందుతున్నం దున వైసీపీ వైపు మొగ్గు చూపితే..వ్యతిరేక ఓటర్ల ప్రభావం అంతంగా ఉండకపోవచ్చని భావి స్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉంటా యనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. ఒకవేళ తెదేపా కూటమి గెలిచినా పొత్తు పెట్టు కుంటే కొన్ని సీట్లు దక్కడం మినహా పార్టీకి ఎదుగుదల ఉండదనే వాదన కూడా ఉం ది. గతంలో పలుమార్లు తెదేపాతో పొత్తు పెట్టుకోవడం వలనే పార్టీ ఏపీలో ఎదగలేదనే అభిప్రాయంతో జాతీయ నాయకత్వం ఉంది. గత అనుభవాలను దృష్టి లో ఉంచుకొని జనసేనతో కలిసి పార్టీని పటిష్టం చేసుకోవాలని జాతీయ నాయకత్వం పలుమార్లు ఆలోచన చేసింది. అయితే ఇక్కడి పరిస్థితులను బట్టి తెదేపాతో పొత్తుకే పవన్‌ కళ్యాణ్‌ మొగ్గు చూపుతున్నట్లు రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పార్టీ లైన్‌పై రాష్ట్ర నేతలకు కేంద్ర నాయకత్వం రూట్‌ మ్యాప్‌ ఇచ్చిందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement