Tuesday, April 16, 2024

ఆనందయ్య మందుపై నివేదిక రెడీ.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ !

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆనందయ్య నాటు మందు కరోనా బాధితులు ఆసక్తిగా ఎరురు చూస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ నిలిపివేశారు. ఆనందయ్య కరోనా మందుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. శాస్త్రీయ అధ్యయనం జరగాలని భావించిన ఏపీ ప్రభుత్వం మందును అధ్యయనం చేయాలని ఆయుష్, ఐసీఎంఆర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆనందయ్య ఆయుర్వేద మందును పరిశీలించిన ఆయుష్ బృందం.. మందు తయారీ విధానంలో వినియోగించిన పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని తెలిపింది. తయారీ పదార్థాలపై ల్యాబ్ రిపోర్ట్ పాజిటివ్‌గానే వచ్చినట్లు ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కూడా కాదని తెలిపారు.

అయితే, కరోనాపై నిర్వహించిన సమీక్షలో ఆనందయ్య మందుపై సీఎం జగన్ ఆరా తీసారు. ఆ మందుపై ఆయుష్ క‌మిష‌న‌ర్ రాములు వివ‌రాలు తెలియ‌జేశారు. ఇప్పటికే ఆనంద‌య్య మందు పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వ‌చ్చాయ‌న్న ఆయ‌న‌.. శనివారం చివరి నివేదిక రానుంద‌న్నారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుంద‌ని చెప్పారు. ఇక‌, కేంద్రం సంస్థ సీసీఆర్ఏ అధ్యయన నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం ఉంద‌న్నారు.

ఇదిఇలా ఉంటే.. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద‌ని ఆయుష్ క‌మిష‌న‌ర్ రాములు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేని విధంగా మందు పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జ‌గ‌న్ సూచించార‌ని చెప్పారు. మందు పంపిణీపై తుది నిర్ణయం సోమవారం తీసుకునే అవకాశం ఉంద‌న్నారు. ఇప్పటి వరకు విచారణ నివేదికలు పాజిటివ్ గా వచ్చాయ‌ని.. టెలిఫోన్ ద్వారా నిర్వహించిన విచారణలోనూ చాలా మంది పాజిటివ్ గా చెప్పార‌ని వివరించారు. ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రైల్స్ ఇంకా ప్రారంభించ‌లేద‌న్నారు. మందుకు ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

మరోవైపు ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కూడా కాదని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో కోవిడ్ బాధితులు కృష్ణపట్నానికి క్యూ కడుతున్నారు. శుక్రవారం నుంచి మందు పంపిణీ ఉంటుందని ప్రచారం జరగడంతో జనం భారీగా తరలివచ్చారు. అయితే, మందు పంపిణీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమొద్దని ఆనందయ్య కోరారు. ప్రభుత్వం నుంచి అనుమలు వచ్చిన వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ఇక, ఈ మందు కోసం వాడే పదార్థాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేనని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోంది. ఐసీఎంఆర్ కూడా మందుపై అధ్యయనం చేస్తోంది. మందుపై నివేదికను కూడా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మందుపై శాస్త్రీయ అధ్యయనం పూర్తయి.. నివేదిక వచ్చే వరకూ పంపిణీకి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకూ బాధితులెవరూ కృష్ణపట్నం రావొద్దని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement