Sunday, December 1, 2024

AP| అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. బుధవారానికి తిరిగి ప్రారంభమవుతాయి. రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బుధవారం సమావేశమై బడ్జెట్ పై చర్చించనున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.

అదే సమయంలో రేపు మధ్యాహ్నం కూటమి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కూటమి పార్టీల శాసనసభ సభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ విధిగా హాజరు కావాలని పార్టీ నుంచి ఆదేశాలను జారీచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement