Saturday, April 20, 2024

త్వరలో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి డిసెంబరులో మరోసారి అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే ఈ నెలలో ఐదు రోజులు.. డిసెంబర్​లో మరో ఐదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఇంకా తుదినిర్ణయానికి రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement