Wednesday, November 27, 2024

AP – రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన అచ్చెన్నాయుడు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు .

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ప్రారంభించారు

రైతులపై ప్రముఖ కవి గుర్రం జాషువా రాసిన.. ‘‘వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్య రమ పండి పులకింప సంశయించు వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు..” అన్న కవితను మంత్రి చదివి వినిపించారు.

రైతులకు ఈ పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని నిరంతరం ఆలోచించే, అందుకోసం నిరంతరం ప్రయత్నించే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే, గత ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వెన్నెముక వంటి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర జనాభాలో 62 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడిందని చెప్పారు.

- Advertisement -

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్ లో పకృతి వ్యవసాయానికి, సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగించి భూసార పరీక్షలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు.

ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా రాయితీపై ఎరువుల పంపిణీ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.

కేటాయింపులు..అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు

ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు

భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు

పంటల బీమా – రూ.1,023 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు

రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు

ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు

పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు

డిజిటల్‌ వ్యవసాయం – రూ.44.77 కోట్లు

వడ్డీ లేని రుణాలకు – రూ.628 కోట్లు

రైతు సేవా కేంద్రాలకు – రూ.26.92 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ – రూ.44.03 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement