Sunday, December 1, 2024

AP – నటి జత్వానీ కేసు – విచార‌ణ వాయిదా

26 వ‌ర‌కు ఐపిఎస్ ల‌కు ఊర‌ట‌
పోలీస్ అధికారుల బెయిట్ పిటిష‌న్
కౌంట‌ర్ దాఖ‌ల చేయాల‌ని ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

అమ‌రావ‌తి – ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారులకు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కాస్త‌ ఊరట లభించింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. దీనిపై
ఈ నెల 26వ తేదీ లోగా కౌంటర్‌ ఫైల్‌ చేయాలని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఇదే సమయంలో . నవంబర్‌ 26వ తేదీ వరకు పోలీస్ అధికారుల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఇంటీరియమ్ ఆర్డర్స్ పొడిగించింది..

కాగా, సినీ నటి జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు… ఇదే కేసులో ఇంప్లిడ్ అయ్యారు సినీనటి జత్వానీ.. మొత్తంగా ఈ కేసులో విచారణ 26వ తేదీకి వాయిదా పడడంతో.. అప్పటి వరకు ఐపీఎస్‌లు, పోలీసు అధికారులకు ఊరట లభించినట్టు అయ్యింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement