Friday, April 19, 2024

అంతుచిక్క‌ని వ్యాధి.. వెయ్యికిపైగా పందులు మృతి

అంతుచిక్క‌ని వ్యాధి బారిన ప‌డి పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్నాయి వరాహాలు. గ‌త నెల రోజుల్లో వెయ్యికి పైగా పందులు మృత్యువాత ప‌డ్డాయి.ఈ సంఘ‌ట‌న ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చోటు చేసుకుంది. స్థానిక తిరుపతమ్మ దేవాలయం దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు. మునేరు పరిసర ప్రాంతాల వైపు మేతకు వెళ్తున్న పందులు ఆ తర్వాత తిరిగి రావడం లేదు. దీంతో వాటిని వెతికేందుకు వెళ్లిన పెంపకందారులు ఎక్కడపడితే అక్కడ చనిపోయి పడివున్న పందులను చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. పందుల మరణం కారణంగా ఒక్కొక్కరు లక్షల్లో నష్టపోయినట్టు చెబుతున్నారు. వాటికి మందులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో అధికారులకు సమాచారం అందించినట్టు పెంపకందారులు చెప్పారు. చనిపోయిన పందుల నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించినా అవి కుళ్లిపోవడంతో సాధ్యం కాలేదని పశువైద్యులు పేర్కొన్నారు. వాటికి పెట్టే ఆహారం, నీళ్లు మార్చాలని పెంపకందారులకు సూచించినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement