Saturday, April 20, 2024

గోరంట్ల మాధవ్‌ వీడియో ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. త‌ప్పుడు వీడియో సర్కులేట్‌ చేసిన వారిపై చర్యలు

అమరావతి, అంద్రప్రభ: హిందూపురం ఎంపీ. గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో లీక్‌ ఎపిసోడ్‌ లో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అమెరికాలోని ఎకిలిప్స్‌ ఫోరెన్సిక్స్‌ అనే ప్రవేట్‌ సంస్థకు చెందిన జిమ్‌ స్టాఫర్డ్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న నివేదిక అసలుది కాదని జిమ్‌ స్టాఫర్డ్‌ స్పష్టం చేయడంతో మరోసారి దీనిపై చర్చ మరలా తెరపైకి వచ్చింది. దీనిపై ఎపీ సీఐడీ పెట్టిన మెయిల్‌ కు సంభందిత ల్యాబ్‌ నుంచి వివరణ వచ్చిందని సిఐడి అదనపు డిజిపి పివి.సునీల్‌ కుమార్‌ గురువారం స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐడి చీఫ్‌ మాట్లాడుతూ మీడియాలో ప్రసారమైన ఆవీడియో అనంతపురం జిల్లాకు చెందిన ఎంపి గోరంట్ల మాధవ్‌ కు ఒక మహిళకు మధ్య జరిగిన సంభాషణగా అభియోగమని పేర్కొన్నారు.

ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను మరో మూడో వ్యక్తి మొబైల్‌ ద్వారా రికార్డు చేసి దానిని రిలీజ్‌ చేశారని, అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఎంపి గోరంట్ల మాధవ్‌ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. మీడియాలో సర్కులేట్‌ అయిన వీడియోను కొంత మంది అమెరికాలోని ఎకిలిప్స్‌ ఫోరెన్సిక్స్‌ అనే ప్రవేట్‌ సంస్థకు పంపగా దానిని పరిశీలించి అది ఒరిజినల్‌ వీడియోనే అని ఆ సంస్థ ధ్రువీకరించి ఒక సర్టిఫికెట్‌ జారీ చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను ఎకిలిప్స్‌ ఫోరెన్సిక్స్‌ సంస్థకు రాయగా ఎక్పిలిప్స్‌ ఫోరెన్సిక్‌ సంస్థకు చెందిన జిమ్‌ స్టాఫర్డ్‌ మెయిల్‌ ద్వారా సమాధానం ఇస్తూ అది తాను జారీ చేసిన ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ కాదని స్పష్టం చేస్తూ ఆయన జారీ చేసిన ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ ను మెయిల్‌ ద్వారా పంపారని అది తమ వద్ద ఉందని సునీల్‌ కుమార్‌ మీడియాకు స్పష్టం చేశారు.

మీడియాలో స్కీన్ర్‌ పై సర్కులే-టైన వీడియో ఒరిజనల్‌ వీడియో లేకుండా అది అసలు వీడియోనా లేక నకిలీదా అనేది నిర్ధారించడం కష్టమని అదే విషయాన్ని అనంతపురం ఎస్పి పకీరప్ఫ ఇటీ-వల నిర్వహించిన తన ప్రెస్‌ మీట్‌ లో కూడా స్పష్టం చేశారని ఎడిజి సునీల్‌ కుమార్‌ చెప్పారు. కాగా, అమెరికాకు చెందిన ఎకిలిప్స్‌ ఫోరెన్సిక్స్‌ సంస్థ అనేది ఒక ప్రవేట్‌ ల్యాబ్‌ అని దానికి ఏవిధమైన అధికారిక గుర్తింపు,అనుమతి లేని సంస్థని సిఐడి అదనపు డిజిపి పివి.సునీల్‌ కుమార్‌ స్పష్టం చేశారు.ఈవీడియోను మీడియాలో సర్కులేట్‌ చేసిన ప్రసాద్‌ పోతినతో పాటు- ఈఅంశంలో భాగస్వాములైన వారందరిపైన ఇన్పర్మేషన్‌ -టె-క్నాలజీ(ఐటి) సెక్షన్‌ 67 ప్రకారం చట్టపరమైన అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు- సిఐడి ఎడిజి సునీల్‌ కుమార్‌ మీడియాకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement