Monday, December 2, 2024

AP | తిరుపతి జిల్లాలో మరో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): జిల్లాలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వడమాలపేట, వెంకటగిరి ఘటలను మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ చెప్పిన గంటల వ్యవధిలోనే యర్రావారిపాలెం యలమంద దళిత వాడలో మరో దారుణం వెలుగు చూసింది.

పదో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి

గ్రామానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. పాఠశాల నుంచి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెకు మత్తు నీరు తాగించే ప్రయత్నం చేశారు. బాలిక నిరాకరించడంతో ఆమెపై విక్షణారహితంగా దాడి చేశారు. ఆపై అత్యాచారం చేశారు. ఎవరికో వీడియో కాల్ చేసి బాలిక ఈవిడో కాదో అని ఆరా తీశారు. తీవ్రంగా గాయపడిన బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను పొదల్లోనే వదిలేసి పారిపోయారు.

అసలు విషయం బయటపడిందిలా

బాలిక తండ్రి రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లగా అక్కడ ఆమె కనిపించలేదు. ఎంత సేపటికి ఇంటికి రాకపోవడడంతో తండ్రి దారి వెంబడి చూసుకుంటూ వస్తుండా పొదల్లో ఏడుపులు వినిపిండంతో అక్కడికి వెళ్లారు. అక్కడ తన బిడ్డ నిస్సాహాయంగా పడిఉండడం చూసి ఆమెను స్థానికుల సాయంతో యలమంద మంద పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పీలేరుకు తరలించారు.

- Advertisement -

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హుటాహుటిన గ్రామానిక చేరుకుని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement