Saturday, May 28, 2022

ఏపీలో కొత్త‌గా మ‌రో 4528 కరోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీ వైద్యాధికారుల విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్తగా మ‌రో 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది. ఇందులో 20,61,039 మంది కోరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 14,508 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,313 గా ఉంది. కాగా గడిచిన 24 గంటల్లో 418 మంది కోవిడ్‌ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారని ఏపీ వైద్యాధికారులు పేర్కొన్నారు.

అయితే కోవిడ్‌తో ఇవాళ ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,17,96,337 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్యాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో అనంతపూర్‌లో 300 పాజిటివ్‌ కేసులు, చిత్తూర్‌లో 1022, ఈస్ట్‌ గోదావరి327, గుంటూరులో 337, కృష్ణాలో166, కడపలో 236, కర్నూల్‌లో 164 విశాఖపట్టణంలో 992, శ్రీకాకుళంలో 385 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు. రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement