Wednesday, April 17, 2024

మందుబాబులకు గుడ్ న్యూస్.. 90 MLతో పాటు క్యాన్ బీర్

ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులకు ఇది స్వీట్ న్యూసే. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్ బీర్​తో పాటు 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ అనుమతి ఇచ్చింది. అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీ శాఖ పేర్కొంది. కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు ల్యాబ్‌కు రూ.5 లక్షలు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. లిక్కర్ వాక్‌ఇన్ స్టోర్సులో ధరల పట్టిక ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మద్యం స్టాక్ ఆడిట్‌కు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆడిట్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి ప్రత్యేక ఆడిట్ బృందం బాధ్యతలు చేపట్టనుంది. 

ఇది కూడా చదవండిః విశాఖలో తెలుగుభాషా దినోత్సవం

Advertisement

తాజా వార్తలు

Advertisement