Thursday, April 18, 2024

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు… కొత్త నిబంధనలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005, ఐపీసీ సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు 150 మందికి మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వం తెలిపింది.

కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే జరిమానా విధిస్తారు. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తారు.

ఇది కూడా చదవండిః ఆ పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement