Thursday, September 12, 2024

AP: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య..?

అనంతపురం, ఆగస్టు 28, ప్రభ న్యూస్ బ్యూరో : అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఎలగలవంక తండాలో దారుణం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున కొడుకుతో కలిసి భర్తను భార్య హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

కొడుకు రాజశేఖర్ జులాయిగా తిరుగుతున్నాడని తండ్రి తిప్పేస్వామి నాయక్ (53) మందలించాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న తిప్పేస్వామి నాయక్ ను కొడుకు, భార్య లక్ష్మీబాయి కలిసి గొంతు నులిమి చంపినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెలుగుప్ప పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement