Tuesday, March 26, 2024

సర్కార్ దవాఖానాలో బెడ్లు ఫుల్ – వైద్యం నిల్…

డాక్టర్లు, సిబ్బంది కొరత.
వైద్యం అందక ఇతర ఆసుపత్రులకు పరుగులు.

హిందూపురం అర్బన్ – కరోనాను అడ్డుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. గత ఏడాది కరోనాను ఎలాగైన అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాసుపత్రులకు కోట్లాది రూపాయలు వెచ్చించి వెంటిలేటర్లు సరఫరా చేసింది. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయితే కోట్లు వెచ్చించి వెంటిలేటర్లు కొనుగోలు చేసిన ప్రభుత్వాలు వేలు వెచ్చించి అనిస్థిషియా సాంకేతిక సిబ్బంది నిర్వహించకపోవడంతో ఆయువు వున్నా రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత సంవత్సరం మార్చి నెలలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పట్టణం ప్రాంతంలో కోవిడ్ కేసులు నమోదు కావడం జరిగింది. హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకల కోవిడ్ ఆసుపత్రి, 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో 200 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిని మార్చి సాధారణ రోగులకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. అయితే ఈ నెలలో లెక్కకు మించి కేసులు నమోదు కావడంతో 150 పడకలతో కోవిడ్ ఆస్పత్రితో పాటు 50 పడకల ఐసోలేషన్ వార్డులో ప్రారంభించడానికి అవసరమైన చర్యలను తీసుకుని ప్రారంభించారు. అయితే కోవిడ్ ఆస్పత్రికి 150 పడకల సామర్థ్యం కి అవసరమైన వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం కోవిడ్ ఆసుషత్రికి 20 మంది సాధారణ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య నిపుణులు 48 మంది నర్సులు, 15 మంది పారి శుద్ధ్య కార్మికులు, మరో 15 మంది ఎఫ్ ఎన్ ఓ, ఎం ఎన్ ఓ లు, పదిమంది సెక్యూరిటీ సిబ్బంది అవసరం అని స్థానిక వైద్య అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఎనిమిది మందికి కంటి వైద్యులను, 12 మంది నర్సులను, 11 మంది ఎఫ్ ఎన్ ఓ, ఎం ఎన్ ఓ లను నియమించడం జరిగింది.ఇందులో ముగ్గురు నర్సులు ఇక్కడ జాయిన్ అయిన వెంటనే వెళ్లిపోయారు, ఎఫ్ ఎన్ ఓ, ఎన్ ఎం ఓ లు ఎనిమిది మంది ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా అన్ని విభాగాల్లోనూ సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. 200 పడకల సామర్థ్యంతో ఆసుషత్రి ఉండి అన్ని సౌకర్యాలతో పాటు రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య సిబ్బంది లేకపోవడంతో కరోనా రోగులకు వైద్య సేవలు అందడం లేదు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్య ఆరోగ్య సిబ్బంది నియమించి రోగులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement