Saturday, March 18, 2023

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పెనుకొండ మండలం హరిపురం వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయ‌ప‌డ్డారు. వీరిని స్థానికుల స‌హాయంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement