Monday, November 11, 2024

AP: శ్రీవారి సన్నిధిలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి కుటుంబం..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 3(ప్రభ న్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటంబం సమేతంగా దర్శించుకున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే వెంట భర్త వెంకట కిషోర్ రెడ్డి, మామ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తల్లిదండ్రులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి దంపతులు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి శ్రీ వేంకటేశ్వరస్వామి కృపతో.. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆమె ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement