Monday, April 15, 2024

ఆసుపత్రిలో నిండుగా ఆక్సిజన్ – 40 బెడ్లు ఖాళీ

హిందూపురం అర్బన్ – హిందూపురం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో నాలుగు రోజులుగా అధికారుల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ రావడంతోపాటు అనంతపురం నుంచి 110 ఆక్సిజన్ సిలెండర్లు రావడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతోపాటు తూమకుంట వేదిక్ ఇస్పాట్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ప్రారంభంకావడంతో అక్కడి నుంచి రోజుకు 100 కు పైగా ఆక్సిజన్ సిలెండర్లు తెచ్చుకునేందుకు అధికారులు సిద్ధం చేశారు.ఈ నేపథ్యంలో కొవిడ్ ఆసుపత్రికి అవసరమైన ఆక్సిజన్ నింపడంతో అటు అధికారులు, ఇటు అడ్మిట్ అయిన బాధితుల్లో కూడా ధైర్యం వచ్చింది. దీంతో నిన్నటి వరకు ఆక్సిజన్ సరిపడినంతా లేదని వైద్యులు అడ్మిట్ చేసుకోవడానికి జంకారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అడ్మిట్లు ప్రారంభించారు. అయితే సోమవారం ఉదయం 18 మందిని డిశ్చార్జ్ చేయగా 30 మందిని అడ్మిట్ చేసుకున్నారు. మరో 20 ఆక్సిజన్ బెడ్ తో ఆక్సిజన్ కాని మరో 20 బెడ్లు ఖాళీగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement