Monday, October 14, 2024

AP: 14న విజయవాడలో మొల్లమాంబ విగ్రహావిష్కరణ!!

బత్తలపల్లి, సెప్టెంబర్ 12(ప్రభన్యూస్) : రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి కుమ్మర ఆడపడుచు శ్రీమొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ ఈనెల 14న విజయవాడలో చేపడుతున్నట్లు టీడీపీ కుమ్మర శాలివాహన సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి కుమ్మర మదనాపు పోతలయ్య పేర్కొన్నారు.

గురువారం మండల కేంద్రమైన బత్తలపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య ఆధ్వర్యంలో చేపడుతున్న కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా కర్ణాటక పార్లమెంటుసభ్యులు, మైసూర్ మహారాజు యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, కుమ్మర సంఘం నాయకులు ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు.

ఈనెల 14వ తేదీన శనివారం ఉదయం 10గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున అన్ని జిల్లాల నుండి కుమ్మర శాలివాహన సోదరి సోదరులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పోతలయ్యతో పాటు కుమ్మర వెంకటనారాయణ, కుమ్మర రమణ, భానుకోట రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement