Thursday, April 25, 2024

కరోనా కట్టడికి అన్నీ సిద్ధం చేశాం – మంత్రి శంక‌ర నారాయ‌ణ‌

హిందూపురం టౌన్ – కరోనా కట్టడికి అన్ని విధాలా ఔషధాలను సిద్ధం చేశామని రోడ్లు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్నారాయణ అన్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులతో సమీక్షించి అన్ని వసతులు కల్పించాలని సూచించిన‌ట్లు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో క‌రోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, రాష్ట్ర రహదారుల, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ హిందూపురం లో పర్యటించారు హిందూపురం గ్రామీణ మండలం తూముకుంట పారిశ్రామికవాడలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించి ప్లాంట్ నిర్వాహకులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కొవిడ్ వార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు స్థానిక పురపాలక సంఘం కార్యాలయం లో అన్ని శాఖల అధికారులతో మంత్రి, కలెక్టర్ ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ కర్ణాటకలో పూర్తిస్థాయి కలిపి విధిస్తున్న నేపథ్యంలో వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో అలాంటి వారిని గుర్తించి కోవిడ్ పరీక్షల నిర్వ‌హించాల‌న్నారు. వ‌చ్చే వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచ‌డ‌మో, ఆస్పత్రులకు తరలించ‌డ‌మో చేయాల‌న్నారు . ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు 6 ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం హిందూపురంలో 415 పడకలు అందుబాటులో ఉండగా 200 మంది చికిత్స పొందుతున్నారని అత్యవసరమైన వారికి మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకొని అందిస్తున్నామని మిగిలిన వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకొని కావలసిన రోగులకు తగినంత ఔషధాలను వారికి అందజేస్తున్న టు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement