Saturday, April 20, 2024

ప్రైవేటు రాబందులు….

కాసుపత్రుల్లో కరోనాసురులు
ఆక్సిజన్‌ బెడ్ల పేరుతో దోపిడీ
షేరింగ్ మాటున దందా
శ్రీ పాజిటివ్‌ లేకపోయినా అక్కర్లేని వైద్యం
లక్షల్లో వసూళ్లు.. బిల్లు అడిగితే కసుర్లు
ఆరోగ్యశ్రీ పేరు చెబితే నో బెడ్‌
అనంతలో అడ్డగోలు వ్యవహారం

అనంతపురం, : ప్రాణాంతక కరోనా వైరస్‌బారిన పడుతున్న బాధితులకు ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. బాధితులు రెండు, మూడు రోజుల్లోనే ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతు న్నారు. వెంటనే ఆక్సిజన్‌ అందించి చికిత్స ఇవ్వకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లు తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారమైనా ప్రాణాలను కాపా డుకునేందుకు ప్రైవేటు- ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరైతే చిన్న అను మానం వచ్చానా ముందుగానే ఆసుపత్రిలో చేరిపోతున్నారు. దీని ని అవకాశంగా తీసుకున్న కొందరు ప్రైవేటు- ఆసుపత్రుల నిర్వాహ కులు అడ్డుగోలు ఫీజుల తో దోచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు చూపిస్తుంటే బెడ్లు ఖాళీ లేవని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో ప్రాణాలు కాపా డు కునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో రూ. లక్షలు ధారబోస్తున్నామని బాధితులు వాపోతున్నారు. గుంత కల్లుకు చెందిన వెంకట నాగభూషణం గత నెల 19న అనంతపు రం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. 10 రోజుల తరు వాత చనిపోయాడు. దీంతో కుటు-ంబ సభ్యుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆసుపత్రి ఎదుటే ధర్నా చేశారు.
రోజుకు లక్షన్నర చొప్పున 10 రోజులకు రూ.15 లక్షలు చెల్లించామని, అయినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో నాగభూషణం ప్రాణాలను కా పాడలేక పోయారని, పైగా వాటికి బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
విరేచనాలకని వెళితే..
విరేచనాలతో చికిత్స కు వెళ్లిన మహిళకు కరోనా వచ్చిందని చెప్పి చికిత్స పేరుతో రూ.లక్షలు వసూలు చేసిన మరో ఆసుపత్రి నిర్వాకం 1వ తేదీన వెలుగు చూసింది. గుంతకల్లుకు చెందిన మహిళ విరేచనాలతో బాధపడుతూ గత నెల 26న నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిందని చెప్పి చికిత్సకు రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత, శనివారం ఆమె మరణించింది. పెండింగ్‌ బిల్లు మరో రూ. లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పడంతో కుటు-ంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి మృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్ష చేయించగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో యాజమాన్యం రాజీకి వచ్చి కుటు-ంబ సభ్యులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి కేసు లేకుండా రాజీ చేసు కున్నారు. ఈ సంఘటనలు ఉదాహరణలు మాత్రమే. వెలుగులోకి రాని ఇలాంటి ఉదంతాలు ఇంకా ఎన్నో.
ప్యాకేజీల పేరుతో దోపిడీ
ఐసీయూలో చేరి వెంటిలేటర్‌ పై చికిత్స అందించడానికి రోజుకు రూ.75 వేల నుంచి రూ. లక్షకు పైగా ఫీజు వసూలు చేస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న బాధితులను జనరల్‌ వార్డుల్లో చికిత్స అందించడానికి రోజుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. అలా కాదం టే షేరింగ్‌ రూములను ఆఫర్‌ చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు బాధితులు కలసి రూము షేర్‌ చేసుకుంటే రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఛార్జి చేస్తున్నారు. ఇలా వారం నుంచి రెండు వారాల పాటు- చికిత్స తీసుకోవాల్సి ఉండటంతో వారం రోజులు
ఒక ప్యాకేజీ, రెండు వారాలకు ఒక ప్యాకేజీ కింద ధరలు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. వీటికి బిల్లులు ఇస్తున్నారా? అంటే అదీ లేదు. మెడికల్‌ రీఎం బర్స్‌ మెంట్లు-, మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ రాబట్టు-కునేందుకు కొంతమంది బిల్లులు అడుగుతుంటే ఇచ్చేదిలేదని ఖచ్చితంగా చెబుతున్నారు. తమ కండిషన్లకు ఒప్పుకున్న వారికే వైద్యసేవలు అందిస్తున్నారు.
75 ప్రైవేటు -ఆసుపత్రులకే అనుమతులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేక జిల్లా అధికారులు ప్రైవేటు- ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. జిల్లాలో 75 ప్రైవేటు- ఆసుపత్రులకు 4600 బెడ్స్‌ కేటాయించి చికిత్సకు అనుమతులిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద బాధితులకు వైద్యం అం దించాలని, ఐసీయూలో వెంటిలేటర్‌పై క్రిటికల్‌ ట్రీ–టె-్మంట్‌ ఇస్తే రోజుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు, కేవలం ఐసీ యూలో ట్రీ-ట్‌మెంట్‌ కు రూ. 10 వేల నుంచి రూ.12 వేలు, క్రిటికల్‌ కేర్‌ వార్డుల్లో ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేస్తే రోజుకు రూ.5 వేల నుంచి రూ.6500లు, నాన్‌ క్రిటి కల్‌ కేర్‌ వైద్యానికి రోజుకు రూ.3 వేల నుంచి రూ.6 వేలు మించకుండా ఫీజు లు వసూలు చేయాలని ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. గట్టిగా ప్రశ్నిస్తే బెడ్స్‌ ఖాళీ లు లేవంటూ తేల్చేస్తున్నారు. కొన్నిచోట్ల రెండింతల బెడ్స్‌ వేసుకుని రూ.కోట్లు- దండుకుంటు-న్నారు. కొన్ని ప్రైవేటు- ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు కూడా అనధికారికంగా బాధితులకు వైద్యసేవలందిస్తూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసుకుంటు-న్నారు.
-టె-స్టుల పేరుతో నిలువు దోపిడీ
ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్‌ -టె-స్టులు నామమాత్రంగా నే ఉండటంతో ప్రజలు ప్రైవేటు- ఆసుపత్రులు, ల్యాబొరేటరీలను ఆశ్రయిస్తున్నారు. వీటికి కూడా ప్రభుత్వం పరిమిత సంఖ్యలో పర్మిషన్‌ ఇచ్చి ఫీజులు నిర్ధారించింది. కరోనా పరీక్షకు రూ.499, సీటీ- స్కాన్‌ కు రూ.3 వేలకు మించి వసూలు చేయ కూడదు. కానీ ప్రైవేటు- ల్యాబ్‌లో కొవిడ్‌ -టె-స్టుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు, సీటీ- స్కాన్‌ కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. 24 గంటల్లో రిపోర్ట్‌ కావాలంటే అదనం. కాగా అధిక ఫీజులు వసూలు చేయకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేలా పర్యవేక్షించేందుకు నోడల్‌ అధికారులు, ప్రైవేట్‌ ల్యాబ్‌లలో -టె-స్టుల నిర్వహణపైనా పర్యవేక్షణకు కమిటీ-లను ఏర్పాటు- చేశారు. కానీ వీరేమీ సమర్థ వంతంగా పనిచేయడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement