Friday, March 29, 2024

ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌ కాఫీయింగ్‌, ప్రైవేటు కళాశాలలతో అధికారుల‌ కుమ్మక్కు..

పుట్టపర్తి శ్రీసత్యసాయి, ప్రభన్యూస్‌: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండల పరిధిలోని శీతిరెడ్డిపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలలో భారీగా మాస్‌ కాఫీయింగ్ జ‌రుగుతోంది. ఓబులదేవరచెరువు శ్రీవీరబ్రహ్మం జూనియర్‌ కళాశాల, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల, శ్రీవిజ్ఞాన్‌ బాలికల కళాశాల విద్యార్థులకు అమడగూరులో పరీక్ష కేంద్రం ఉండ‌డంతో ఇక్కడే పరీక్షలు రాస్తున్నారు. అయితే అమడగూరు కళాశాల ప్రిన్సిపాల్‌ పబ్లిక్‌ పరీక్షలకు చీఫ్‌ సూపరింటెడెంట్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అమడగూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రవేటు కళాశాలల యాజమాన్యంతో కుమ్మక్కై మాస్‌ కాఫీయింగ్‌ చేస్తూ ఆ విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారన్న‌ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీఫ్‌ సూపరింటెండెంట్‌ ప్రవేటు కళాశాలల యాజమాన్యంతో లక్షలాది రూపాయలకు ఒప్పందం కుదూర్చుకొని విద్యార్థులకు మైక్రో జీరాక్స్‌ కాఫీలు అందజేస్తూ మాస్‌ కాపీయింగ్‌ కు ప్రొత్సాహిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి.

కాగా, మైక్రో జిరాక్స్‌ కాఫీలను కేవలం ప్రవేటు కళాశాలల విద్యార్థులకు మాత్రమే అందజేసి వారి ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు కృషి చేస్తున్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా వ్యవహరిస్తున్నారని, ఇరవై రోజుల క్రితమే ఓబులదేవరచెరువులో బారీగా మైక్రో జీరాక్స్‌ పుస్తకాలను కోనుగోలు చేశారని తెలుస్తోంది. అంతేకాక ప్రైవేటు కళాశాల విద్యార్థులను సిట్టింగ్‌ అరెంజ్‌ మెంట్‌ కూడా దగ్గర దగ్గరగా కుర్చోబెట్టి కాఫీయింగ్‌ చేయిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు సొంత కాలేజ్‌ లు ఉన్న కళాశాలలకు పరీక్ష కేంద్రాలుగా నియమించకూడదని ఆదేశాలు రావడంతో మాస్‌ కాపీయింగ్‌ ను అరికట్టడానికి అమడగూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను పరీక్ష కేంద్రంగా నియమిస్తే ఇక్కడ ప్రవేట్‌ కళాశాలల యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుని అదే ప‌నికి పాల్ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై ఇన్ చార్జి ప్రిన్సిపల్‌ ప్రభాకర్‌ను వివరణ కోరగా త‌మ‌ కాలేజీలో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరగలేదని తనపై గిట్టనివారు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement