Wednesday, April 24, 2024

తుంగ‌భ‌ద్ర‌ డ్యామ్‌కు పోటెత్తిన వరద.. 92,576 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కణకల్లు ప్రభన్యూస్‌: తుంగభద్ర జలాశయం (టీ-బీ డ్యాం)లో వరద ఉదృతి కొనసాగుతోంది. డ్యాం పరివాహక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయానికి శనివారం రాత్రి 7 గంటలకు 92,576 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద వచ్చి చేరుతోంది. డ్యాం పరివాహక ప్రాంతాలైన తీర్థ నల్లి, శివమొగ్గ, హరిహర, ఆగుంబె, శృంగేరి, సాగర్‌, హోసనగర, కడురు ప్రాంతాల్లో వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి. శృంగేరి వద్ద ఉన్న తుంగ డ్యాం గేట్లు ఎత్తి నది నీరును దిగువకు వదులు తున్నారు.అలాగే భద్ర గేట్లు ఎత్తి ఆ నీరు కూడా తుంగభద్ర డ్యాంలో మళ్ళిస్తుండడంతో డ్యాంలో వరద ఉదృతి ఎక్కువవుతోంది.

మరో రెండ్రోజుల్లో 1.5 లక్షల పైబడి దాకా వరద పోటు ఉంటుందని ఫలితంగా 40 టీఎంసీల పైబడి నీటి లభ్యత చేకూరే అవకాశాలు ఉన్నట్లు సెంట్రల్‌ వాటర్‌ స్కీమ్‌ (సీ డబ్లివ్‌ సీ) లెక్క గడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 100.855 టీ-ఎంసీల నీటి సామర్థ్యానికి 1633.00 అడుగులకు గాను ప్రస్తుతం 1600.11 అడుగుల మేర 92,576 క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద తాకిడితో 26 టీ-ఎంసీల నీటి సామర్థం లభ్యత చేకురినట్లు అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement