Tuesday, April 13, 2021

మున్సిపల్ చైర్మన్ కు ఘన సన్మానం

ధర్మవరం అర్బన్ – తొలి మున్సిపల్ మహిళా చైర్మన్ లింగం నిర్మల దంపతులు ను ఆదివారం స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కన్యకా పరమేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మెన్ దంపతుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల రామ్ కుమార్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్, కార్యదర్శి నామ రాజా, దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు అంబటి అవినాష్, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు రేపాకుల సురేష్ బాబు, జయంతి వినోద్ కుమార్, గ్రందే శ్రీనివాసులు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్. మున్సిపల్ చైర్మన్ ని సన్మానిస్తున్న ఆర్య వైశ్య సంఘం సభ్యులు.

Advertisement

తాజా వార్తలు

Prabha News