Thursday, April 25, 2024

అనంతలో అన్నీ బంద్….

అనంత‌పురం జిల్లా అంత‌టా నేటి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ప‌గ‌టి పూట క‌ర్ప్యూ ప్రారంభ‌మైంది.. అత్య‌వ‌స‌ర ర‌వాణ‌, స‌రుకులు మిన‌హా అన్ని వ్య‌వ‌స్థ‌లు మూత ప‌డ్డాయి… పోలీసులు అనేక ప్రాంతాల‌లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఎవ‌రు బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు..కాగా, అనంతపురం నగరంలోని కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పరిశీలించారు. ఇందులో భాగంగా… పాతవూరు, తాడిపత్రి బస్టాండు, మార్కెట్ ప్రాంతాలలో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు/ సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement