Saturday, April 20, 2024

ఏసీబీ వలలో అవినీతి తిమింగ‌లం..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సర్కిల్ సీఐ రాము, కానిస్టేబుల్ ఖరీం ఒక భూ వివాదం పరిష్కారం కోసం బాధితుల నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాత్రి నుంచి వారిద్దరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారిస్తున్నారు. సీఐ రాము ఆది నుంచి వివాదాస్పదంగా ఉన్నారు. గుత్తి సీఐగా పనిచేస్తున్న సమయంలో అక్కడ ఆర్థిక లావాదేవీల విషయంపై సిబ్బంది మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. సీఐ అవినీతిపై ఏకంగా డిఎస్పికి లిఖిత పూర్వకంగా ఎస్సై సుధాకర్ యాదవ్ చేసిన ఫిర్యాదు అప్పట్లో సంచలనంగా మారింది. బుక్కరాయసముద్రం సీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అవినీతి ఆరోపణలు వారి మీద వచ్చాయి. ఎడ్ల బండిపై ఇసుక తీసుకెళ్లే రైతుల నుంచి మామూలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లాయి. చాలాకాలంగా సీఐ రాము వ్యవహారంపై నిఘా వేసిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు వల పని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement