Thursday, March 28, 2024

అనంత‌లో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం.. కేంద్రాల వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు..

అనంతపురం: ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులు పోలీసు కానిస్టేబుల్ కావాలన్న తలంపుతో పెద్ద సంఖ్యలో పరీక్షలకు హాజరయ్యారు. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. అనంతపురంలో వివిధ సెంటర్ల వద్ద అభ్యర్థులు కిక్కిరిసిపోయారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 24 వేల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ రాసేందుకు పోటీపడ్డారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఇ.నాగేంద్రుడు, అనంతపురం రీజనల్ కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో సీలు వేసిన ప్రశ్నా పత్రాల బాక్సులను ప్రత్యేకంగా కేటాయించిన బస్సులలో ఆయా పరీక్షా కేంద్రాలకు పంపారు. అనంతపురం నగరంలో ఉన్న మొత్తం 34 పరీక్షా కేంద్రాలను 6 రూట్లుగా విభజించి ఒక్కో రూటుకు మొబైల్ పార్టీతో పాటు సి.ఐల నేతృత్వంలో ఎస్కార్ట్ వాహనాల్లో పోలీసు సిబ్బంది ప్రశ్నా పత్రాల తరలింపు సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement