Tuesday, April 23, 2024

రామ్ చ‌ర‌ణ్ జ‌న్మ‌దిన వేడుక‌లు.. బాలుడి చికిత్స కోసం రూ.10వేలు సాయం

అనంత‌పురం – మెగా ప‌వ‌ర్ స్థార్ రామ్ చరణ్ జన్మదిన వేడుక‌ల‌ను జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు భవాని రవికుమార్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా . ఎస్వి థియేటర్ లో సైకిల్ స్టాండ్ లో పనిచేస్తున్న పార్వతి శ్రీనివాసుల దంపతుల కుమారుడు రంజిత్ కుమార్ వైద్యం కోసం రూ.10 వేల న‌గ‌దు ర‌వికుమార్ అంద‌జేశారు.. ఎనిమిది సంవత్సరాలు రంజిత్ గత కొన్ని సంవత్సరాలుగా నడుము వంగిపోతూ వింత వ్యాధికి గురై బాధ‌ప‌డుతున్నాడ‌ని, విష‌యం తెలుసుకున్న చిరంజీవి అభిమాన సంఘం త‌రుపున న‌గ‌దు సాయం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ర‌వికుమార్ చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement