Friday, June 9, 2023

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి..

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకుంది. బెంగళూరులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న అఖిల్ లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అఖిల్ రైలు కింద పడి బలవన్మరణం చెందాడని తెలుస్తోంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేకనే అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement