Monday, April 12, 2021

మండల పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం

పుట్టపర్తి రూరల్ – మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని రిటర్నింగ్ అధికారి రాము పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఒక జడ్పీ స్థానానికి నేడు ఎన్నికలు జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల దూరంగా ఉండడంతో ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయి.మండల వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 21,518 ఉన్నారు.27 పోలింగ్ కేంద్రాలకు,135 మంది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు .14 మంది ఎన్నికల పరిశీలకులు,5 మంది రూట్ అధికారులు, నలుగురు జోనల్ అధికారులు ను సిద్ధం చేశామన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు అనంతరం బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక భద్రత మధ్య కదిరి లో జరిగే కౌంటింగ్ ప్రదేశానికి తరలిస్తామన్నారు. నేడు జరిగే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సీ ఐ బాలసుబ్రమణ్యం రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News