Thursday, April 25, 2024

కరోనా పై ప్రభుత్వాలు బాధ్యత గా వ్యవహరించాలి-అఖిల‌పక్షం

హిందూపురం, – విపత్కర పరిస్తితులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు భాద్యతగగా వ్వవహరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని అఖిలపక్ష సభ్యులు పేర్కొన్నారు. హిందూపురం ప్రాంతంలోని అఖిలపక్ష పార్టీల సమన్వయ కమిటీ సమావేశం అఖిలపక్ష కార్యాలయంలో బాలాజీ మనోహర్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడుతూ, కరోనా పై ప్రభుత్వాలు బాధ్యత గా వ్యవహరించాలని అనేక సమస్యలు పరిస్కారం చేయాలన్నారు. కరోనా బాధితులకు మానసికంగా ధైర్యంగా ఉండాలని మనో నిబ్బరంగా ఉండి వైద్యుల చూచనలు పాటిస్తూ మంచి ఆహార ఆరోగ్య నియమాలు పాటిస్తేనే కరోనా పై విజయం సాదించవచ్చునన్నారు. కాగా, అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువాసరం ఉదయం 10 గంటలకు తూముకుంట లోని ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ఆక్సిజన్ కొరత తీర్చాలని ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా సోకిన వారిలో చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారని ప్రధానంగా అన్ని ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మొదటి దశ కరోనా కన్నా రెండవ దశలో కరోనా వ్యాప్తి అతివేగంగా జరుగుతుందని ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టాలన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రభుత్వాలు కూడా ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ కొరత తీర్చాలని ఆసుపత్రుల్లో పడకలు పెంచాలని వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి గ్రస్తులకు సహాయార్థం బియ్యం , పప్పు , ఉప్పు , చింతపండు వంటి వంట సరుకులు ఇవ్వాలని తీర్మానించారు. మానవతావాదులు , దాతలు అందరు కూడా సహకరించి అఖిలపక్ష కమిటీకి సహాయ , సహకారాలు అందించాలని వారు కోరారు.ఈ సమావేశంలో కన్వీనర్ ఇంతియాజ్ ,బాలాజీ మనోహర్, బీఎస్పీ శ్రీరాములు,టీడీపీ డీ ఈ రమేష్ కుమార్, ముస్లిం నగారా ఉమ్మర్ ఫారూఖ్ ఆర్ సీ పీ శ్రీనివాసులు, సీ ఐ టీ యూ రామకృష్ణ, రాము పెద్దన్న యస్ ఫ్ ఐ బాబావలి నాయకులు అమానుల్లా,సమీవుల్లా దుర్గా నవీన్ దాదాపీర్ అంజాద్ ఫయాజ్, ఇబ్రహీం, నూరుల్లా ముజ్జు అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష కమిటీ నాయకులు , ప్రజా సంఘాలు , స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement