Friday, April 26, 2024

అనంత‌పురం మేయ‌ర్ గా మ‌హ్మ‌ద్ వ‌సీం‌, డిప్యూటీ మేయ‌ర్ గా వాసంతి..

అనంత‌పురం – న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ గా మ‌హ్మ‌ద్ వ‌సీం‌, డిప్యూటీ మేయ‌ర్ గా వాసంతిలు ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.. నేటి ఉద‌యం కౌన్సిల్ హాలులో కొత్త‌గా ఎన్నికైన కార్పొరేట‌ర్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు.. అనంత‌రం మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పోస్ట్ ల‌కు క‌లెక్ట‌ర్, ప్రిసైడింగ్ అధికారి గంధం చంద్రుడు నిర్వ‌హించారు.. వైసిపి త‌రుపు నుంచి ఆయా పోస్ట్ ల‌కు ఒక్కొక్క‌రే నామినేష‌న్ వేయ‌డంతో వ‌సీం,వాసంతిలు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు.కాగా కొత్త‌గా ఎన్నికైన వారిని అనంత‌పురం ఎమ్మెల్యే అనంత వెంక‌ట‌రామిరెడ్డి దితరులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement