Wednesday, November 6, 2024

Ananthapur – కారు – లారీ ఢీ .. ఆరుగురు స్పాట్ డెడ్

అనంత‌పురం జిల్లాలో కారు – లారీ ఢీకొన్న ప్ర‌మాదంలో ఆరుగురు మ‌ర‌ణించారు.. జిల్లాలో సింగ‌న‌మ‌ల ప్రాంతంలో నాయ‌నప‌ల్లె క్రాస్ వ‌ద్ద నేడు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న అయిదుగురు స్పాట్ లోనే మ‌ర‌ణించారు.

మృతులంతా అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారిగా సమాచారం. అనంతపురం – కడప హైవేపై ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి నగరంలో ఇస్కాన్ నగర సంకీర్తనకి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురంకు కారు వస్తోంది. మృతులు సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement