Thursday, April 25, 2024

నకిలీ కరోనా మందు అమ్ముకుంటున్నారు: ఆనందయ్య..

తన పేరుతో తయారు చేసిన నకిలీ మందు అమ్మకంపై ఆనందయ్య స్పందించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో తాను మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నానని, కొందరు మాత్రం తన పేరుతో నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య ఆరోపించారు. తన పేరుపై తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే అందుకు తాను బాధ్యుడ్ని కానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ నకిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్.. ఖబర్దార్.. నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక

Advertisement

తాజా వార్తలు

Advertisement