Monday, September 20, 2021

అమరావతే ఏపీకి రాజధాని: తేల్చి చెప్పిన వైసీపీ రెబల్ ఎంపీ

ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అమరావతి భూములపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని తెలిపారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ఎక్కడ జరగలేదని హైకోర్టు తేల్చిచెప్పిందని స్పష్టం చేశారు. రాజధాని మార్పుకు సీఎం జగన్, కొందరు మంత్రులు చెబుతున్న సాకులు.. సహేతుకం కాదని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. అమరావతే ఏపీకి రాజధాని అని, అంతిమ విజయం రైతులదే అవుతుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. వీలైనంత తొందరగా ఈ సమస్యను సీఎం జగన్ పరిష్కరించాలని రఘురామ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News