Thursday, April 25, 2024

Amaravati: రాజధాని ఉద్యమం.. బిల్లు వెనక్కి తీసుకున్నా.. ఆగని పాదయాత్ర

అమరావతి రైతుల చేపట్టిన మహాపాదయాత్ర నేటితో 23 వరోజుకు చేరుకుంది. ఇవాళ నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. రాజధాని అంశంపై నిన్న సీఎం జగన్ చేసిన ప్రకటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

కాగా, మొత్తం 45 రోజుల పాటు కొనసాగనున్న రైతుల పాదయాత్ర డిసెంబర్ 15న తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు గ్రామాల్లో ఘన స్వాగతం లభిస్తోంది. ప్రజలు, పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement