Friday, April 19, 2024

Allagadda Fire Brand – తీహార్ జైలులో ఉన్నా విజయం నాదే – భూమా అఖిల‌ప్రియ‌

ఎన్ని ఇబ్బందులు వచ్చిన,ఎన్ని కష్టాలు పెట్టినా తనను తీహార్ జైల్లో వేసినా జైల్ నుంచి నామినేషన్ వేసి గెలుస్తానని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు.. స‌హా టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డి, అఖిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న‌ది.. ఇటీవ‌ల ఇరు వ‌ర్గాలు నారా లోకేష్ ఎదుటే దాడులు చేసుకున్నారు.. ఈ కేసులో అఖిల ప్రియ‌ను పోలీస్ లు అరెస్ట్ చేశారు.. ఇటీవ‌లే ఆమె బెయిల్ పై విడుద‌య్యారు.. ఈ సంద‌ర్భంగా ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, ఆళ్ళగడ్డ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని, వారికి ఎప్పుడూ రుణ పడి ఉంటానని భూమా అఖిలప్రియ తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద ఇద్దరం ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నప్పుడు తనను మాత్రమే ఎందుకు ఆరెస్ట్ చేశారని ఏవీ సుబ్బారెడ్డి కేసులో పోలీసుల తీరుపై అఖిలప్రియ అభ్యంతరం తెలిపారు. తన భర్త భార్గవ్ రామ్ అస్సలు సంఘటన జరిగిన చోటే లేడని, కానీ ఆయన మీద కూడా కేసు పెట్టారని ఆరోపించారు. ఆళ్లగడ్డలోనే కాదు, నంద్యాలలో కూడా ఇంటింటికీ తిరుగుతానని ఈ సందర్భంగా అఖిల తెలిపారు.


తెలంగాణ పోలీసులు ఒక అమ్మాయి విషయంలో అన్యాయం జరిగితే నిందితులను కాల్చి చంపితే శబాష్ అని మనమే అన్నామని, కానీ ఇక్కడ పరిస్ధితి వేరుగా ఉందని అఖిల తెలిపారు. ప్రజల నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారని అఖిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ కేసులకు భయపడనన్నారు. తనను ఆపాలని చూస్తే చంపడం తప్ప మరేమీ చేయలేరన్నారు. ప్రజలే తన దేవుళ్ళని, ప్రజలే తన దిక్కని అఖిల ప్రియ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మహిళా హోంమంత్రి మహిళలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడాలన్నారు.


మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను పార్టీకి ఇంకా దగ్గర అవుతున్నా అని సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు మిమ్మల్ని స్వాగతించడం పక్కన పెట్టి మహిళలు కొడతారన్నారు. తనను ఇబ్బంది పెట్టిన ఒకరి మీదనే తాను కేసు పెట్టానని, కానీ నాతో పాటు 10 మంది పైన కేసు పెట్టినావంటూ ఏవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి అన్నారు. పోలీసు అధికారులకు ఏవి సుబ్బారెడ్డి మీద ఎందుకు అంత ప్రేమ అని అఖిల ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ వాళ్లు డబ్బు తీసుకున్నారా, లేక వాళ్ళకి ఏమైనా లోబడి పని చేసారా అని అడిగారు. ఏవీ సుబ్బారెడ్డి అస్సలు పార్టీలో ఉన్నారా అని ప్రశ్నించారు. పార్టీలో ఉంటే అతను పార్టీ కోసం ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశాడని నిలదీశారు. ఎవరైతే గుంట నక్కలు ఉన్నారో వాళ్ళ గురించి నారా లోకేష్ చూసుకుంటాడన్నారు. రాబోయే ఎన్నిక‌ల‌లో ఎవ‌రు ఏమిటో ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement